ETV Bharat / state

నేలకొరిగిన పంటను కోసేది ఎలా? ఒడ్డుకు చేర్చేది ఎలా? - paddy farmers latest news

గత నెలలో భారీగా కురిసిన వర్షాలకు పంటచేలు నీటమునిగాయి. కొన్ని చోట్ల పూర్తిగా కోతకు పనికిరాకుండా పోగా.. మరికొన్ని ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు తట్టుకున్న వరిపొలాలు నేలనంటాయి. యంత్రాల ద్వారా పంటను కోసే పరిస్థితి లేదు. చేతికొచ్చిన కొంచెం పంటను అమ్ముకోలేకపోతున్నారు. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.

paddy crop
వర్షాల కారణంగా పాడైన వరిపంట
author img

By

Published : Nov 18, 2020, 6:37 PM IST

గత నెలలో కురిసిన వానలకు తూర్పు గోదావరి జిల్లాలో పంట నీట మునిగి, నేలకు ఒరిగింది. పూర్తిగా నేలనంటిన పొలాలు అలాగే ఉండిపోవటంతో గింజల నుంచి మొలకలు వచ్చి పంటచేలు పచ్చగా మారాయి. యంత్రాల ద్వారా కోసేందుకు అనుకూలంగా లేకపోవటంతో కూలీలతో పనులు చేయిస్తున్నారు. ఇది రైతులకు అదనపు భారం అవుతోంది. ఎంతో కష్టపడి ధాన్యాన్ని గట్టుకు చేర్చినా.. రంగు మారిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం, వ్యాపారులు ముందుకు రావటం లేదు.

జిల్లాలోని తాళ్ళరేవు, ఐ పోలవరం, ముమ్మడివరం, కాట్రేనికోన మండలాలలో 90% పంట నష్టం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కౌలు రైతులు సాగు చేస్తారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలు సర్కారు నమోదు చేసుకున్నా.. పరిహారం మాత్రం భూ యజమానికే దక్కింది. ఫలితంగా.. కౌలు రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వారికి పంట రుణాలు ఇవ్వకపోవటం, తడిసిన ధాన్యాన్ని కొనకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి:

నకిలీ మిర్చి విత్తనాలు.. రైతులు కన్నీటిపాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.