తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని గౌతమి గోదావరి నదీ పాయకు అనుసంధానంగా కోరంగి కెనాల్ యానాం నుంచి తాళ్లరేవు వరకు 8 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది.. ఈ కెనాల్ గట్టు కింద నాలుగు గ్రామాలు సుమారు ఐదు వందల ఎకరాల పంట భూమి ... వంద ఎకరాల వరకు కొబ్బరి తోట ఉంది ..
ఐదేళ్ల క్రితం వచ్చిన భారీ వరదలకు ఏటిగట్టు బలహీనపడటంతో మూడేళ్ల క్రితం ప్రభుత్వం గట్టును ప్రటిష్ట పరిచి గ్రావెల్ రోడ్డు వేసింది. గత ఏడాది ఆగస్టులోవచ్చిన వరదలకు పోలేకుర్రు పంచాయతీ పందుల లంక వద్ద ఏటిగట్టు కోతకు గురైంది..
ఏడాది గడిచినా గండినిపూడ్చక పోవటంతో వరద వస్తే పంటపొలాలు నీట మునుగుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
ఇదీ చూడండి: చాపకింద నీరులా కరోనా.. చెక్ పెట్టేదెలా?