తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట వద్ద ప్రధాన రహదారిలో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న మందపల్లి ఆనందరావు అనే వ్యక్తి బస్సును తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావటంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోరంగి ఎస్సై సతీష్ తెలిపారు.
ఇదీ చదవండి: