తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి నుంచి వరద నీటిని దిగువన ఉన్న సముద్రంలోకి వదిలారు. వరదతో గౌతమీ గోదావరి నదీ పాయ పోటెత్తుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని నదీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
గత ఏడాది ఇలాంటి వరదల్లో మూడు కాలనీలకు చెందిన 200 గృహాలు నెల రోజుల పాటు ముంపులోనే ఉండిపోయాయి. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకుని యానాం ప్రజా పనుల శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆత్రేయ నదీపాయ ఏటి గట్టుపై నూతనంగా నిర్మించిన స్లూయిజ్ వద్ద వరద నీరు పెరగటంతో నిలువరించేందుకు ఇసుక బస్తాలు సిద్ధం చేశారు.
ఇదీ చూడండి:
వెంకన్నకు అన్నమయ్య కీర్తనలు రాస్తే.. చేతన్ యానిమేషన్ చేశాడు!