తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తొలగించడం విమర్శలకు దారితీసింది. గ్రామస్థులందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి.. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సౌజన్యంతో బస్ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు.
స్థానిక వైకాపా నాయకులు షెల్టర్ తొలగించి, ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి కల్యాణమండపం దగ్గర వదిలేశారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షెల్టర్ తొలగింపుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి..