ETV Bharat / state

అర్హులందరికీ ప్యాకేజీ ఇవ్వండి: ఎమ్మెల్యే ధనలక్ష్మి - తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి.. పోలవరం నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రంపచోడవరం ఐటీడీఎ కార్యాలయంలో అధికారులతో ఆమె సమావేశమయ్యారు.

nagullapalli dhanalaxmi
రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
author img

By

Published : May 6, 2020, 11:46 AM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అధికారులకు స్పష్టం చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయభాస్కర్, ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్​ను కోరారు.

రంపచోడవరం ఐటీడీఎ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. గత ఏడాదిలో గోదావరి వరదలవల్ల దేవీపట్నం మండలంలో పలు గ్రామాలు ముంపునకు గురైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది అలా కాకుండా ముందుగానే ప్యాకేజీ చెల్లించి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు.

ఇవీ చూడండి:

రాజమహేంద్రవరంలో హ్యాండ్​వాష్ ట్యాంక్​లు ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.