ETV Bharat / state

భార్యను దూరం చేసిందని.. అక్కపై పెట్రోలు పోసి.. - ap latest news

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సూర్యనారాయణపురంలో దారుణం జరిగింది. తన భార్యను దూరం చేసిందనే అనుమానంతో.. ఓ వ్యక్తి తన సోదరిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.

murder attempt on sister by her brother in east godavari
భార్యను దూరం చేసిందని.. అక్కపై పెట్రోలు పోసి..!
author img

By

Published : Jan 3, 2022, 10:46 PM IST

ఘటన వివరాలు వెల్లడించిన సీఐ కృష్ణ

భార్యను తనకు దూరం చేసిందనే అనుమానంతో.. సొంత అక్కపై పెట్రోలు పోసి తమ్ముడు నిప్పంటించడం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్యనారాయణపురంలో కలకలం రేపింది. బొర్రా మోహన్ బాబు అనే వ్యక్తి.. తన అక్క కుమారిపై పెట్రోల్‌తో దాడి చేశాడు. తన భార్యను దూరం చేసిందనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలు కుమారిని.. చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్​కు తరలించారు.

బాధితురాలికి 75 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. పెట్రోల్ దాడిచేసి పారిపోతున్నమోహన్‌ బాబును.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కారణం అక్కేనని..
మోహన్ బాబు, అతని భార్యకు మధ్య గొడవలు జరిగాయి. ఆ వివాదాలతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే.. భార్య తనను వీడి వెళ్లిపోవడానికి అక్క కుమారి కారణమని భావించిన మోహన్ బాబు.. పలుమార్లు గొడవపడ్డాడు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కుమారి ఇంట్లో వంట చేస్తుండగా..పెట్రోల్ తీసుకువచ్చి తనపై పోసి నిప్పంటించాడు. బాధితురాలి కుమారుడు అశోక్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. అతడిని సైతం పక్కకి తోసేశాడు. దీంతో.. అశోక్ సైతం గాయపడ్డాడు. తల్లీ కొడుకులిద్దరిని ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

కుటుంబం ఆత్మహత్య.. పరారీలో ఎమ్మెల్యే కుమారుడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.