తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎంపీ మార్గాని భరత్ ప్రచార ఆటోలను ప్రారంభించారు. నగరమంతా 25 ఆటోలు తిరుగుతూ ప్రజలకు అవగాహన కలిగిస్తాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, వైకాపా నాయకుడు శివరామసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వివిధ శాఖల సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని... ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉండి కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించాలని ఎంపీ కోరారు.
ఇదీ చూడండి: