తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఎంపీ మార్గాని భరత్‌రామ్ పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనల మేరకు సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రజలు అవగాహన పెంచుకుని అత్యవసరం అయితే గాని బయటికి రావాలని సూచించారు. అందుకు అనుగుణంగా రాజమహేంద్రవరం నగరంలో రైతు బజార్లను విశాలమైన ప్రదేశాలకు తరలించామని తెలిపారు. నగరంలో విధులు నిర్వర్తిస్తున్న మీడియా, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వారికి కళ్ళజోళ్ళను అందించారు. నగరంలో చాలామంది రోడ్డు పక్కన తిండి లేక అవస్థలు పడుతున్నారని వారి కోసం ఇస్కాన్ సంస్థతో మాట్లాడి భోజన ఏర్పాట్లు చేశామన్నారు.
ఇదీ చూడండి: