ETV Bharat / state

తల్లీకుమార్తెల హత్య.. డ్రైనేజీలోకి రక్తం!

తూర్పు గోదావరి జిల్లాలో తల్లి కుమార్తె హత్య కలకలం రేపింది. హత్యకు గురైన విషయం తెల్లవారేదాకా తెలియలేదు. డ్రైనేజీలోకి రక్తం రావడాన్ని గమనించిన స్థానికులు.. విషయాన్ని గుర్తించారు.

mother_and_daugher_died_Suspectedly
author img

By

Published : Aug 25, 2019, 1:48 PM IST

తల్లీకుమార్తె హత్య..డ్రైనేజీలోకి రక్తం!

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో తల్లీ కుమార్తెల హత్య సంచలం సృష్టించింది. దండు గంగమ్మ వీధిలో తల్లి మాధవి, కుమార్తె కరుణ అద్దెకుంటున్నారు. రోజూ మాదిరిగానే తమ పనులను ముగించుకుని రాత్రి నిద్రించారు. ఉదయం తలుపు తెరవకపోవడం, ఇంటిముందు డ్రైనేజీ కాల్వలోకి రక్తం రావడం గమనించి భయభ్రాంతులకు గురైన పొరుగింటివాళ్లు... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి రక్తం మడుగులో మాధవి, కరుణ విగతజీవులై పడి ఉన్నారు. హత్య జరిగినట్టుగా సంఘటనా స్థలం ఆధారంగా తెలుస్తోంది. మాధవి ఓ ప్రవేటు కళాశాలలో ఆయాగా పనిచేస్తోంది. కొద్దికాలం క్రితమే కాకినాడ నుంచి రామచంద్రాపురం వచ్చి కూతురుతో ఉంటోంది. భర్త శ్రీనివాసరావు, కుమారుడు విజయ్‌ కాకినాడలో ఉంటున్నారు. భర్త అనారోగ్యం పాలయ్యాడు. అప్పుడప్పుడూ రామచంద్రపురం వచ్చి వెళ్తుంటారు. మూడు నెలలుగా శ్రీనివాసరావు ఇంటికి రావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు హతమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

స్వామిజీనంటూ వచ్చాడు.. త్రినేత్రానికి దొరికిపోయాడు!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.