తూర్పు గోదావరి జిల్లా శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో నమోదైన 6 కరోనా పాజిటివ్ కేసులపై స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ స్పందించారు. కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తి తన అత్తింటికి రావటంతో తమ నియోజకవర్గంలో ఆరుగురు కొవిడ్ బారిన పడ్డారన్నారు. ఈ విషయం తనని ఎంతో కలచివేసిందన్నారు. మనం ఎవరింటికీ వెళ్లొద్దు... ఎవర్నీ మన ఇంటికి రానివ్వొద్దని పిలుపునిచ్చారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, రహదారులపైకి రాకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఇదీ చదవండి: సాయం కోసం పడిగాపులు.. తిండి కోసం కష్టాలు