ETV Bharat / state

నాకు కొవిడ్ సోకలేదు.. అదంతా తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే చిట్టిబాబు - తనకు కొవిడ్ సోకిందన్న ప్రచారంపై ఎమ్మెల్యే చిట్టిబాబు స్పష్టత

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు కొవిడ్ సోకిందంటూ హల్​చల్​ చేస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. కావాలనే దురుద్దేశంతో కొందరు తప్పడు ప్రచారానికి తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

mla chittibabu clarity on covid attack to him
తనకు కరోనా సోకిందన్న వార్తలపై ఎమ్మెల్యే చిట్టిబాబు క్లారిటీ
author img

By

Published : May 22, 2021, 7:20 PM IST

తనకు కరోనా సోకలేదని.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు.తనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిందంటూ.. కొన్ని చానళ్లు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20న కుటుంబ సభ్యులు, గన్​మెన్, కారు డ్రైవర్​తో సహా అందరమూ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నామని.. అందరికీ నెగిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు.

వైరస్​తో బాధపడుతూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని.. అధికారులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. తనను కలిసిన వారెవరూ ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదని వివరించారు.

ఇదీ చదవండి:

ఈ సేవా కేంద్రం వద్ద మహిళల పడిగాపులు.. ఆధార్​తో ఫోన్ నంబర్ అనుసంధానానికి తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.