ETV Bharat / state

'చోడవరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం' - చోడవరంలో దేవదాయశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

విశాఖ జిల్లా చోడవరంను ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా దేవదాయశాఖ, పోలీసు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

mla karanam dharmasri meeting with endowment department officers
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
author img

By

Published : Jun 8, 2020, 3:23 PM IST

విశాఖ జిల్లా చోడవరంను ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా దేవదాయశాఖ, పోలీసు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని ఓ రెస్ట్ హౌస్​ను తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. దేవస్థానం రూ.23 కోట్లతో వైయస్​ఆర్ కళాభారతి ఆడిటోరియం నిర్మిస్తుందని ఆయన అన్నారు. ఈ ఆడిటోరియంలో సాంస్కృతిక, కళా ప్రదర్శనలు నిత్యం జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడువాక సత్యారావు, బొడ్డేడ సూర్యనారాయణ పాల్గొన్నారు.

ఇదీ చూడండి. మద్యంబాబులకు పట్టని కరోనా భయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.