ETV Bharat / state

'పంటలు ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం' - mla jaggireddy visited antreyapuram latest news update

ముంపు బారిన పడుతున్న పంట పొలాలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులను ఆదేశించారు.

MLA examining the works
పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Oct 18, 2020, 10:42 PM IST

Updated : Oct 18, 2020, 10:47 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని ఆత్రేయపురం, ఉచ్చిలి, వద్ధిపర్రు గ్రామాల్లో కొన్ని రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాణిజ్య పంటలు ముంపు బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ముంపు సమస్యను రైతులు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో సంప్రందించి ఉచ్చిలి సమీపంలోని ఆర్ అండ్ బి రోడ్డుకు గండికొట్టి, పంట పొలాల్లో నీటిని కాలువలకు మళ్ళించారు.

భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినా.. పంట పొలాలు ముంపు బారిన పడకుండా గండికొట్టిన స్థానంలో సిమెంట్ తూరలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో ఆ స్థానంలో అధికారులు తూరలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ జరుగుతున్న పనులను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. స్లూయిజ్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆర్అండ్ బి, ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

ఇవీ చూడండి:

సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన

Last Updated : Oct 18, 2020, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.