పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. మండలంలోని పెదపూడి గ్రామంలో నాలుగు గ్రామాలకు చెందిన 406 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ ఇళ్ల స్థలాల కాలనీలకు జగనన్న కాలనీగా నామకరణం చేశారు.
ఇదీ చదవండి: 'ఆ ఎమ్మెల్యే పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి'