గ్రామ సచివాలయ అనుబంధ భవనాల నిర్మాణాలకు సంబంధించి స్థలాల సేకరణలో అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఫిబ్రవరి వరకు నియోజకవర్గంలో అన్ని సచివాలయాల పరిధిలో విధాన భవన నిర్మాణాలను నూరు శాతం పూర్తి చేయాలని ఆధికారులకు నిర్దేశించారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎంపీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో వివిధ శాఖల అధికారులతో సమీక్షనిర్వహించారు.
కొన్ని భవనాలు నిర్మించేందుకు స్థలాలు లేవని అధికారులు ఆయన దృష్టికి తీసుకొవచ్చారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని భవనాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించే విషయంలో కొంతమంది అధికారులు పరోక్షంగా ఆక్రమణదారులుకు సహకరిస్తున్నారని... దీన్ని ఏ మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
అనంతరం జగనన్న తోడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్ముల కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.
'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు