తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం రంగాపురంలో 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు రాష్ట్ర మంత్రులు విశ్వరూప్, కన్నబాబు శంకుస్థాపన చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం జగన్ వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కార్యాచరణ చేశారని వారు అన్నారు. అమలాపురం రూరల్ మండలం సమనస పరిధిలోని రంగాపురం వద్ద 500 కోట్ల రూపాయల నిధులతో వైద్యకళాశాలను నిర్మించనున్నారు. అతి త్వరలో వీటి నిర్మాణ పనులు చేపట్టి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వారు వెల్లడించారు. కోనసీమ నుంచి ఉన్నత వైద్యం కోసం కాకినాడ రాజమండ్రి వంటి దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా అమలాపురంలో వైద్య కళాశాల అందుబాటులోకి రావడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. CM Jagan: 'పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే మా లక్ష్యం'