తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. స్వామివారి జన్మనక్షత్రం మఖపర్వదినం సందర్భంగా స్వామివారి పంచామృతాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దర్శనాంతరం మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఈవో త్రినాథరావుని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి. ముగిసిన గవిమఠం బ్రహ్మోత్సవాలు