ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందటం చంద్రబాబుకు ఇష్టం లేదా అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల భావోద్వేగాలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. అధికార వికేంద్రీకరణతోనే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. చంద్రబాబు కావాలనే అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం శ్రీబాగ్ ఒప్పందంలోనూ ఉందన్న ఆయన.. గత పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. మంత్రివర్గ ఆమోదం తరవాత రాజధాని, సచివాలయాలపై విధానపరమైన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి వెల్లడిస్తారని తెలిపారు.
ఇదీ చదవండి :