లాక్‌డౌన్ కారణంగా గత నెలన్నరగా తూర్పుగోదావరి జిల్లాలో చిక్కుకున్న వివిధ ప్రాంతాల వలస కార్మికులు తమ స్వగ్రామాలకు పంపించాల్సిందిగా అధికారులను కోరుతున్నారు. వారంతా కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. 656 మంది ఇతర జిల్లాల వారు, 1883 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది.
వీరుకాక పర్యటకులు, బంధువుల ఇళ్లకు వచ్చినవారు సుమారు 2వేల మంది ఉంటారని అంచనా వేశారు. ఇప్పటివరకూ 2,300 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీరిని స్వస్థలాలకు పంపేందుకు రాజమహేంద్రవరం నుంచి 2 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. విశాఖ నుంచి జిల్లా మీదుగా నడిచే రైళ్లలో బోగీలు కేటాయించాలని కోరినట్లు వివరించారు.
ఇవీ చదవండి.. చీకట్లో వలస కూలీల అవస్థలు