కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరిధిలోని వరద బాధితులకు అండగా నిలిచింది 'మన భోజనం'. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుమారు 2 వేల కుటుంబాలు.. యానాం పరిధిలో స్థిర పడ్డాయి. మధ్య తరగతికి చెందిన వారందరూ ఏళ్ల తరబడిగా కలిసి మెలిసి జీవిస్తున్నారు. నాలుగు కాలనీలుగా ఏర్పడిన వారికి గోదావరి వరదలు కష్టాలను తెచ్చిపెట్టాయి. ఒక్కరోజు కాదు పదిరోజులకు పైగా నీళ్లు నిండిన ఇళ్లలోనే ఉండిపోయారు. కాపాడాల్సిన పుదుచ్చేరి ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను నిర్మించుకున్నారని సహాయం అందించలేమని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు.
ఇటువంటి పరిస్థితుల్లో వారిని ఆదుకుంది మన భోజనం సంస్థ. లాక్ డౌన్ కాలంలోనూ ప్రతిరోజు వెయ్యి మంది ఆకలి తీర్చింది మన భోజనం. యానం ప్రజా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలోని మన భోజనం... తర్వాత కాలంలో హోం క్వారంటైన్ కంటోన్మెంట్ జోన్లలో ఉన్నవారికి కూడా అండగా నిలిచింది. నాటు పడవలపై వెళుతూ భోజనం అందిస్తున్నారు. తాజాగా వరదల రాకతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న 3వేల కుటుంబాలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేడి ఆహారాన్ని అందిస్తూ అందరి మనన్నలను పొందుతోంది.
ఇదీ చదవండి: