తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడు లంకలో విషాదం అలుముకుంది.పొగాకు వ్యాపారం చేసుకుంటున్న వెంకట సూర్యనారాయణ మూర్తి(వీఎస్ మూర్తి) అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎప్పటిలాగానే వీఎస్ మూర్తి దుకాణాలకు పొగాకు వేసి వచ్చి పడుకున్నాడు. అలసట చెంది వచ్చాడు కదా అని... సమీపంలోని టేబుల్ ఫ్యాన్ భార్య కల్యాణి వేయాలనుకుంది. అతనికి తగిలేటట్టు తిప్పడానికి ప్రయత్నించగా...విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న వీఎస్ మూర్తి...ఫ్యాన్ పట్టుకొని భార్యను పక్కకు నెట్టే ప్రయత్నం చేశాడు. ఆయనకు కూడా షాక్ కొట్టింది. ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆసుపత్రికి తరలించగా మూర్తి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సృహలోకి వచ్చిన భార్య కల్యాణి... రెండేళ్లు, నాలుగేళ్ల బిడ్డల్ని పట్టుకొని భర్త కోసం విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించిం
ఇదీ చూడండి: గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు