ETV Bharat / state

'పోలవరం నిర్వాసితుల కోసం జైళ్లకైనా వెళ్తాం' - All party leaders Mahadharna in Vijayawada

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసేవరకు పోరాడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించకుండానే బలవంతంగా గ్రామాల నుంచి ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 5న విజయవాడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు.

All party leaders
అఖిలపక్ష నేతలు
author img

By

Published : Jul 3, 2021, 8:08 AM IST

పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై యుద్ధం తప్పదని, జైళ్లకు వెళ్లడానికైనా సిద్ధమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల హక్కుల సాధనకు అఖిలపక్షంగా ఏర్పడ్డ ఆయా పార్టీల నేతలు శుక్రవారం చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో పర్యటించారు. చట్టి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మధు మాట్లాడుతూ.. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించకుండానే బలవంతంగా గ్రామాల నుంచి ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 5న విజయవాడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో పునరావాసం, పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు పనులు చేయాలని డిమాండ్​ చేశారు. కాఫర్‌ డ్యాం ప్రభావంతో ముంపునకు గురవుతున్న గ్రామాల వారికి పునరావాసం కల్పించే వరకు నెలకు రూ.పది వేల సాయం అందించాలని తెలిపారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గిరిజనులను ఆదుకునేందుకు కనీసం రూ.1250 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, మాజీ ఎంపీ సోడె రామయ్య, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జనసేన నాయకులు వంపూరి గంగులయ్య, కెచ్చల రంగారెడ్డి, చలసాని శ్రీనివాస్‌, కూనంనేని సాంబశివరావు, లింగయ్యదొర పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. NRI: తారస్థాయికి ఎన్నారై వైద్య కళాశాల విభేదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.