తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు సత్తిబాబుకు సుమారు 8 అడుగుల పొడవు, 60 కిలోల బరువున్న భారీ నెమలి కోనాం చేప చిక్కింది. దీన్ని అతను బుధవారం కుంభాభిషేకం చేపల రేవులో ఓ వ్యాపారికి రూ.12 వేలకు విక్రయించారు.
చేప వెన్నుపై పించాన్ని పోలిన రెక్కలాంటి భాగం ఉండటంతో దీన్ని నెమలి కోనాంగా పిలుస్తారు. ఈ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
ఇదీ చదవండి: రూ.లక్షకు అమ్ముడుపోయిన 'కచిడీ' చేప.. ఎందుకంత రేటు? ఏంటీ స్పెషాలిటీ?