తూర్పుగోదావరి జిల్లాలో సమీపంలోని కేంద్రపాలిత యానాంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 100కు చేరుకోవడంతో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ సై ఆదేశాల మేరకు యానాంలోని మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ అధికారులు సీలు వేశారు.
గతవారం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మకాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం కేసులు పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వం విక్రయించే మద్యం కన్నా ఇక్కడ బ్రాండెడ్ మద్యం తక్కువ ధరలకు దొరకడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.. వీరి ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉందని భావించి ఈ నెలాఖరు వరకు మూసివేయాలని తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. అయితే వచ్చే నెల 2వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో,,, ఒకరోజు ముందుగానే మద్యం దుకాణాలు మూసి వేయాల్సి ఉంటుంది. గనుక తిరిగి ఎప్పుడు తెరిచేందుకు అనుమతులు ఇస్తారన్నది తెలియడం లేదని వ్యాపారస్థులు అంటున్నారు.
ఇదీ చదవండి
నిబంధనలు గాలికొదిలేయడం వల్లే వైరస్ విస్తరణ: డాక్టర్ బుర్రి రంగారెడ్డి