స్థానిక సంస్థల ఎన్నికల వేళ పలు జిల్లాలో పోలీసులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేయటంతోపాటు వారి వాహనాలను సీజ్ చేశారు.
గుంటూరు జిల్లా
స్థానిక ఎన్నికల్లో మద్యం సరఫరా చేయడానికి తీసుకువచ్చిన రూ.18,23,000 విలువ చేసే తెలంగాణ మద్యాన్ని గుంటూరు అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ముఠా సభ్యులను.. రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో తెలంగాణకు చెందిన 100 మద్యం బాటిల్స్, ఒక ద్విచక్ర వాహనంను సత్తెనపల్లి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం రంగాపురం గ్రామంలో భూమిలో నిల్వచేసిన మొత్తం రెండు వేల లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వీర్యం చేశారు. 20 లీటర్ల నాటుసారాతో పాటు ఇద్దరు నిందితులను వారు అదుపులోకి తీసుకున్నారు
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనిలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యాన్ని, నాటుసారాను స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. 1904 కర్ణాటక మద్యం సీసాలు, 150 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. చిరంజీవిగౌడ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పొన్నకల్ గ్రామంలో 480 నాటు సారా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు.
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా పెడన మండలం జింజేరు గ్రామ శివారులో మూళ్ల పొదల మధ్యలో రహస్యంగా దాచి ఉంచిన 600 లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అటవీ ప్రాంతంలో నాటుసారాకు వినియోగించే 1800 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి