తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఉత్సవాల నేపథ్యంలో 12 రోజుల హుండీ ఆదాయం రూ. 43,05,015 వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. డివిజన్ తనిఖీదారు జీఎస్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు, ఆంధ్రాబ్యాంక్ కేసువదాసుపాలెం సిబ్బంది, తదితరులు లెక్కింపులో పాల్గొన్నారు.
ఇదీ చదవండి