Hitakarini society: కందుకూరి వీరేశలింగం సమాజంలో దురాచారాలను పారద్రోలేందుకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. వితంతు వివాహాలు జరిపించి, విద్యను ప్రోత్సహించారు. తన తదనంతరం ఈ కార్యక్రమాలు కొనసాగేలా హితకారిణి సమాజం స్థాపించి తన ఆస్తి మొత్తం రాసిచ్చారు. అప్పటి నుంచి ఈ సమాజం ఆధ్వర్యంలో విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరంలోని 31 ఎకరాల విస్తీర్ణంలోని హితకారిణి సమాజం విద్యాసంస్థల ప్రాంగణాలపై ప్రభుత్వం కన్నేసింది. 200 కోట్ల విలువైన ఆ భూములు తమకు ఇచ్చేయాలంటూ విద్యాశాఖ పట్టుబడుతోంది. ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రాంగణాలను తీసుకున్నాక.. వాటిలో అదనంగా ఉన్న భూముల్ని ఇతర అవసరాలకు వాడుకోవచ్చనే వెసులుబాటును గతంలో ప్రభుత్వం కల్పించింది. ఈ పరిస్థితుల్లో హితకారిణి సమాజం భూముల్ని విద్యాశాఖ కోరడంపై.. విమర్శలు వెల్లువెత్తున్నాయి.
హితకారణి సమాజం పరిధిలో ఎయిడెడ్‌లో ఎస్కేవీటీ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలు, ఎస్కేఆర్ మహిళా కళాశాల, ఎస్కేవీటీ. డిగ్రీ కళాశాల వీటి . జూనియర్ కళాశాల, డీఎడ్ కళాశాల, ఎంబీఏ కళాశాల, కందుకూరి స్త్రీ సదనం ఉన్నాయి. దానవాయిపేట, ఇన్నీస్ పేటలో ఈ ప్రాంగణాలు కలిపి 31 ఎకరాల్లో ఉన్నాయి. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ప్రభుత్వానికి అప్పగించినా.. ఆ ప్రాంగణాల్లోనే ఉన్న అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు హితకారిణి సమాజం పరిధిలోనే కొనసాగాల్సి ఉంది.
ఈ భూములు ఇచ్చేయాలని విద్యా శాఖ కోరడంపై ప్రస్తుత పర్యవేక్షిస్తున్న దేవదాయశాఖ అభ్యంతరం చెబుతోంది. ఈ వ్యవహారం ఇటీవల సీఎం కార్యాలయానికి చేరింది. ఇరు శాఖల ఉన్నతాధికారులు సమీక్ష అనంతరం అన్ని ప్రాంగణాలను సర్వే చేయించాలని నిర్ణయించారు. సర్వే అనంతరం నిర్ణయించిన విస్తీర్ణం మేరకు విద్యాశాఖకు అప్పగించాలని తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆ భూముల సర్వే చేపట్టే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: