తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో సెల్‌టవర్ నిర్మాణం విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యం కలకలం సృష్టించింది.
రెండు రోజుల కిందట స్థలం కోసం వివాదం జరగ్గా... తన భర్త అప్పలనాయుడిని కోటనందూరు పోలీసులు తీసుకెళ్లి కొట్టారని... అతని భార్య భవాని ఆరోపించింది. దీన్ని అవమానంగా భావించి తన భర్త ఏలేరు కాల్వ వద్ద ద్విచక్రవాహనం ఉంచి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ ఉంచాడని భవానీ తెలిపింది.
పోలీసులు ఉదయం నుంచి ఏలేరు కాల్వ మొత్తం గాలించారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఒత్తిడి వల్లే పోలీసులు తన భర్తను కొట్టారని భవాని ఆరోపించింది. అప్పలనాయుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.