ETV Bharat / state

కోడిపందేలకు కత్తులు తయారు చేస్తోన్న ఇద్దరి అరెస్టు - ఓజుబంధ గ్రామంలో కోడి పందేలు న్యూస్

తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం ఓజుబంద గ్రామంలో కోడి పందేల నిర్వహణకు కత్తుల తయారు చేస్తోన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 643 కోడి కత్తులు, వాటిని తయారు చేసే మోటార్, యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షరీఫ్​ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా తనిఖీలు ముమ్మరం చేశామని.. ఎవరైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వకుల్​ జిందాల్​ హెచ్చరించారు.

కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు:ఏఎస్పీ
కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు:ఏఎస్పీ
author img

By

Published : Jan 6, 2020, 7:43 PM IST

కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఏఎస్పీ

కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఏఎస్పీ

ఇదీ చదవండి:

'చట్టాలు అప్పటివే.. మార్పు రావాల్సిన అవసరం ఉంది'

Intro:సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందేలు నిర్వాహిస్తే కఠిన చర్యలు:
కోడి కత్తులు స్వాధీనం చేసుకున్న ఏఎస్పీ
సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామాల్లో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం ఓజుబంధ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఎస్సై షరీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడిచేసి 643 కత్తులను, వీటిని తాయరు చేసే మోటార్, యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటూ ఇద్దరు వ్యక్తులకు అదుపులో తీసికొని కేసు నమోదు చేశారు. దీనిపై రంపచోడవరం ఏఎస్పీ కార్యక్రమంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.


Body:కె.వెంకటరమణ, ఈటీవీ భారత్, కంట్రిబ్యూటర్, రంపచోడవరం.


Conclusion:9490877172
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.