ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఈ నెల 10న కేంద్ర బృందం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పాడైపోయిన పంటలను జాయింట్ కలెక్టర్ లక్ష్మి షా పరిశీలించారు. రావులపాలెం మండలంలో పంట పొలాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. ఏయే పంటలు వేశారు ? ఎంత నష్టం వాటిల్లింది ? నష్టంపై అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారా అని ఆరా తీశారు. రైతులకు నష్టపరిహారం త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
పంట పొలాల వెంబడి ఉన్న బోదెలను కొంతమంది ఆక్రమించుకోవడం, పూడ్చి వేయడం వల్లే నీరు కాలువలోకి వెళ్లకుండా పంటపొలాల్లో ఉండిపోతుందని రైతులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పంట బోదెలను ఆధునీకరించాలని, ఆక్రమణను గుర్తించి తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: