ETV Bharat / state

Pawan Kalyan: పాము తన పిల్లలనే మింగినట్లు జగన్‌ సొంత వారినే మింగుతాడు: పవన్ కల్యాణ్ - తూర్పు గోదావరి జిల్లా

Pawan Kalyan comments: ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లే జంప్‌ జిలానీలను తరిమికొట్టాలని... జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఓట్ల చీలడం వల్లే ప్రజావ్యతిరేక ఉన్నా కొందరు విజయం సాధిస్తున్నారని... అందుకే జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం తన విధానం కాదన్న పవన్... అందరినీ కలిపేందుకే వచ్చానని చెప్పారు.

Pawan Kalyan
Pawan Kalyan
author img

By

Published : Jun 25, 2023, 10:52 PM IST

Updated : Jun 26, 2023, 6:39 AM IST

కులాల మధ్య చిచ్చు పెట్టడం తన విధానం కాదన్న పవన్

Pawan Kalyan Varahi Yatra: ఆంధ్రప్రదేశ్ కు వైసీపీ నుంచి విముక్తి కలిగించాలని .. అది జరగాలంటే ముందు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీని జీరో చేయాలి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లులో ఒక్క చోట కూడా వైసీపీ గెలవకూడదని అన్నారు. మలికిపురంలో పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రలో నిర్వహించిన భహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన ఓట్లతో అసెంబ్లీకి వెళ్లి వైకాపా కు వెళ్లారన్న పవన్.. రాపాకలాంటి ఎమ్మెల్యేలను రీ కాల్ చేయాలన్నారు. రెండు వందల రూపాయలు లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుందని...5 వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసేవారు పాలిస్తున్నారని పవన్ మండిపడ్డారు. దొంగ ఓట్లు వేస్తారు, మన ఓట్లు తీసేస్తారన్న.. ఓటర్లు పవన్ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కులాల సర్దుబాటు కోసమే కుల ప్రస్తావన తెస్తున్నాను తప్ప రెచ్చగొట్టటానికి కాదని పవన్ చెప్పారు.

ఓటు చీలడం వల్ల ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్లు గెలుస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు. 70 శాతం ప్రజలు వ్యతిరేకించిన వాళ్లు పదవిలోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఓటుబ్యాంకు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదన్న పవన్ పేర్కొన్నాడు. మనమే జీఎస్టీ చెల్లించి ప్రభుత్వ ఖజానా నింపుతున్నామన్న పవన్.. 100 మంది దగ్గర పన్నులు తీసుకుని 40 మంది వైసీపీ వాళ్లకే లబ్ది చేస్తే ఎలా అన్న పవన్ ప్రభుత్వ ఖజానాలోని డబ్బును అందరికీ న్యాయంగా పంచాలని వెల్లడించాడు. సీఎం బటన్‌ నొక్కితే అందరికీ డబ్బులు పడుతున్నాయా అని ప్రశ్నించాడు. ప్రజలకు సరైన రోడ్లు వేయకుంటే ఎన్ని బటన్లు నొక్కితే ఏం లాభం అంటూ ఎద్దేవా చేశాడు.

ధైర్యవంతులైన 150 మందితో జనసేన పార్టీ ప్రారంభమైందన్న పవన్ కల్యాణ్ జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు చేయటం తన బాధ్యత అంటూ పవన్‌ వెల్లడించారు. తమ పార్టీ ఓటుతో గెలిచి వేరొకపార్టీలోకి పోతే ప్రజలు సహించరని విమర్శించాడు. పార్టీని నడపటం చాలా కష్టసాధ్యమైన పని అంటూ తెలిపిన పవన్‌ కల్యాణ్‌ వేల కోట్లు ఉన్నవాళ్లు కూడా పార్టీని నడపాలంటే భయపడతారుని పేర్కొన్నాడు. సొంత బాబాయిని చంపుకుని మాకు ఏం తెలియదంటే మేం నమ్మాలా? అంటూ పవన్‌ కల్యాణ్ ఆరోపించారు. పాము తన పిల్లలనే మింగినట్లు జగన్‌ సొంత వారినే మింగుతారని విమర్శించాడు. వైసీపీ నేతలు వివిధ ప్రాంతాల నుంచి క్రిమినల్స్‌ను తీసుకొచ్చుకుంటున్నారన్న పవన్ నా మీద ఒక్కరాయిపడినా నేనంటే ఏంటో చూపిస్తానంటూ హెచ్చరించాడు.

గోదావరి వలే తాను కూడా ఈ నేలను అంటిపెట్టుకుని ఉన్నానని పవన్‌ పేర్కొన్నాడు. సభకు వచ్చినవాళ్లు తనపై ఉన్న ప్రేమతో వచ్చినవాళ్లే... డబ్బు కోసం వచ్చినవాళ్లు కాదని వెల్లడించారు. జనసేన తరఫున పోటీ చేయడానికి ప్రతినియోజకవర్గంలో నలుగురు ముందుకు వస్తున్నారని తెలిపారు. తాను కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాలేదనీ, అన్ని కులాలను కలిపేందుకు వచ్చానని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నాడు. విశ్వనరుడు అనే సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ పేర్కొన్నాడు. మొదట భారతీయుడిని, చివరగా భారతీయుడిని అని చెప్పిన అంబేడ్కర్‌ తనకు స్ఫూర్తి అంటూ పవన్ పేర్కొన్నాడు.

Last Updated : Jun 26, 2023, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.