ఏదైనా ఒక కాయ కొమ్మలకు కాస్తే పెద్ద ఆసక్తి ఉండదు. అదే కాయ నేల నుంచి పుట్టుకొచ్చినట్లు కన్పిస్తే ఔరా అనక మానరు. ప్రస్తుతం అటువంటి దృశ్యమే తూర్పుగోదావరి జిల్లా రాజులపాలెంలో చూపరులను ఆకట్టుకుంటుంది.
రాజులపాలెంలో ఓ పనస చెట్టు కాండం మెుదల్లో కాసిన పనస కాయలు నేల మీదే కాసినట్లు కనిపిస్తున్నాయి. పనస చెట్టు చుట్టూ మెుగ్గలు తొడిగి అవి కాయలుగా తయారై, భూమిలో నుంచి కాయలు వచ్చాయా..? అని అనిపించకమానదు ఆ చెట్టును చూస్తుంటే.
ఇదీ చదవండి: చప్పట్లు కొడుతూ ఆహ్వానించిన పోలీసులు.. ఎందుకంటే..!