ETV Bharat / state

సుద్దగెడ్డ వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన - ఉత్తరకంచి ఇళ్లపట్టాలు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ప్రారంభించారు. లంపకలోవ రహదారిలో ఉన్న సుద్దగెడ్డ వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఉత్తరకంచి గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.

inaugurate a bridge on suddagedda vadu
సుద్దగెడ్డ వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన
author img

By

Published : Jan 6, 2021, 8:02 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని లంపకలోవ రహదారిలో ఉన్న సుద్దగెడ్డ వాగుపై వంతెన నిర్మాణానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, జిల్లా కలెక్టర్ మురళీధర్​రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 2కోట్ల 75 లక్షల వ్యయంతో వంతెన నిర్మించనున్నామని, తద్వారా ఎంతో కాలంగా ఉన్న పది గ్రామాల ప్రజల ఇబ్బందులు తీరనున్నయని ఎమ్మెల్యే పర్వత తెలిపారు. దశాబ్దాల కాలంగా ఈ వాగుపై వంతెన లేక వరదలు సమయంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.

ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో 719మంది లబ్దిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. పేదవాడి సొంతింటి కల తీర్చిన ఘనత సీఎం జగన్​దే అని ఎంపీ వంగా గీత అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మురళీధర్​రెడ్డి, ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పాల్గొన్నారు.

ఇదీచదవండి.

'దుడ్డు ప్రభాకర్​ను అక్రమంగా అరెస్టు చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.