రాష్ట్రంలో కొత్త మద్యం విధానం ప్రకారం... స్టార్ హోటళ్ల లైసెన్సు ఫీజును భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇప్పటివరకు స్టార్ హోటళ్లలో ఏటా రూ.24 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును... కోటిన్నరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రాజమహేంద్రవరంలో పర్యటక సదస్సుకు హాజరైన మంత్రి అవంతి శ్రీనివాస్‌కు... హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం భారీగా లైసెన్సు ఫీజును పెంచడం కారణంగా స్టార్ హోటళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని మంత్రికి వివరించారు.
ఇదీ చదవండి : 'మంత్రులకు... సభాపతి తోడయ్యారు'