తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని మడ అడవుల నరికివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మడ అడవులను నరికివేస్తోందంటూ పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.
కాకినాడ పోర్టుకు సమీపంలోనే ఈ మడ అడవులు ఉన్నాయి. దశాబ్దాలుగా కాకినాడను వరదలు, తుపాన్ల నుంచి మడ అడవులు రక్షిస్తున్నాయని స్థానికులు చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్న ఈ మడ అడవులను ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా నాశనం చేస్తోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది.
ఇదీ చదవండి
సీఎం గారూ.. మడ అడవులు మాయం చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారు?