తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో కుండపోత వర్షంతో స్థానిక కొండ వాగులు పొంగి ప్రవహించాయి. వాడపల్లి రహదారిలో వాగులు పొంగి ప్రవహించడంతో రహదారులు కోతకు గురయ్యాయి.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలో రాకపోకలు స్తంభించాయి. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల అధికారులు జేసీబీలతో పునరుద్ధరించే పనులు చేపట్టారు. గంగవరం, రాజవొమ్మంగి, వై రామవరం, మారేడుమిల్లి మండలాలలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రధాన రహదారులు నీట మునిగాయి. మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు పడితే జనజీవనం పూర్తిగా స్తంభించే అవకాశాలున్నాయి.
ఇవీ చదవండి: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.. తొమ్మిది కిలోలు స్వాధీనం