తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయినవిల్లి గ్రామంలో నాలుగు, శంకరాయగూడెంలో అయిదు, నేదునూరు పెద్దపాలెంలో ఏడు కేసులతో మండలంలో మొత్తం కేసుల సంఖ్య 16కు చేరింది. అమలాపురం ఆర్డీఓ బీహెచ్ భవానిశంకర్ ఈ గ్రామాలను సందర్శించి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీచదవండి.