వైకాపా అధికారంలోకి వస్తే దళితులకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఆ పార్టీకి ఓటు వేస్తే.... తనకు న్యాయం జరగడం లేదని శిరోముండనం బాధితుడు ప్రసాద్ అన్నారు. అవకాశం ఉంటే తన ఓటు తిరిగి వెనక్కి ఇవ్వాని కోరారు. తనకు ఇంత అవమానం జరిగి మూడు నెలలు గడుస్తున్న న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు కూడా ఏదోవిధంగా సద్దుబాటు చేసుకోవాలనే చెబుతున్నారు కాని న్యాయం జరగట్లేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. లేదంటే తాను ఏది చేసుకోవడానికైనా వెనుకాడనని బాధితుడు ప్రసాద్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: