తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం.కె.రత్నం పాటల ద్వారా కరోనా నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారు. తానే స్వయంగా పాటను రచించి.. పాడుతున్నారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, తాను రచించిన పాటలను ఆలపించారు.
కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆయన ఇప్పటివరకు ఆరు పాటలు రాశారు. ఓ విధులు నిర్వహిస్తూ... మరోవైపు కరోనా నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహమ్మారిపై పోరాటానికి తన వంతు కృషి చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ను పోలీసు అధికారులు, స్థానికులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: