రాష్ట్ర బీసీ కార్పొరేషన్, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్గా రంపచోడవరం వైకాపా నాయకుడు షేక్ లాలీ నియమితులయ్యారు. చైర్మన్తో పాటు డైరెక్టర్లకు కాకినాడలో సూర్య కళా మందిరంలో సన్మాన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణు గోపాల్, ఎంపీలు వంగా గీత, మాధవి తదితరులు పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు.
బీసీల అభ్యన్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. పదవులు పొందిన వారు వైకాపా బలోపేతానికి పాటుపడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరారు. ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించే స్థాయి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, బీసీల ఆత్మగౌరవ రక్షకుడిగా సీఎం నిలిచారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిచెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కొనియాడారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.
కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం నుంచి వైకాపా నాయకులు రామాంజనేయులు, బొబ్బ శేఖర్, సాయిబాబా, రామకృష్ణ, తమన్న కుమార్, పూజ, రూతు పలువురు వైకాపా నాయకులు హాజరయ్యారు.
ఇవీ చూడండి...