పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతోనూ వైకాపా రాజకీయాలు చేయడం దారుణమని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక వస్తువుల పైన పాఠశాలకు సంబంధించిన లోగో లేదా పేరు ఉండాలి కానీ వైకాపా రంగు వేసుకుంటే ఎలా అని నిలదీశారు. విద్యా కానుకను పార్టీ కానుకగా చేయకండని హితవు పలికారు. జగనన్న విద్యా కానుక లోగో ఉన్న బెల్టు ఫోటోను గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:జగన్ కేసులపై నేడు విచారణ