Protest: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం సగ్గొండ పంచాయతీ పరిధి గోపవరం నుంచి తాళ్లపూడి మండలం గజ్జరం వరకున్న రహదారి భారీ గుంతలతో అధ్వానంగా ఉంది. వరుస వర్షాలకు ఆ గుంతల్లో నీరు చేరి మరీ ప్రమాదకరంగా మారింది. దీంతో వైకాపా నాయకుడు, గోపాలపురం ఏఎంసీ డైరెక్టర్ సాలి వేణు ఆధ్వర్యంలో గోపవరంలో గ్రామస్థులు మంగళవారం ఆందోళన చేశారు. ఒక దశలో రోడ్డు గుంతల్లోనే బైఠాయించారు. కర్మాగారాలకు సంబంధించిన లారీలు ఈ మార్గంలో అధికంగా తిరుగుతుండటంతో రోడ్డు త్వరగా గుంతలు పడుతోందని స్థానికులు తెలిపారు. వర్షాలు తగ్గిన తర్వాత పనులు జరుగుతాయని, అప్పటి వరకు ప్రమాదాలు జరగకుండా కర్మాగారాల యాజమాన్యాలు గుంతలు పూడ్చాలని వేణు కోరారు. చివరికి పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి:
Protest: 'రహదారిని బాగుచేయండి'.. వైకాపా నాయకుడి ఆధ్వర్యంలో నిరసన
Protest: గోపవరం నుంచి తాళ్లపూడి మండలం గజ్జరం వరకున్న రోడ్డు అధ్వానంగా ఉందని.. వైకాపా నాయకుడి ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేశారు. ఒక దశలో రోడ్డు గుంతల్లోనే బైఠాయించారు. చివరికి పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.