ETV Bharat / state

తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే - ఎర్రచందనం పట్టివేత ముగ్గురి అరెస్టు

గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఊరూ వాడా ముంచేసింది. తీరమంతా ముంపులోనే కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం జలదిగ్భందంలోనే మగ్గిపోతోంది. కోనసీమ లంకగ్రామాల్లోకి వరదనీరు చేరుకుంది. పంట పొలాలన్నీ ముంపు బారినపడ్డాయి

తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే!
author img

By

Published : Aug 5, 2019, 5:22 AM IST

తీరాన్ని గోదావరి వరద అతలాకుతలం చేస్తోంది. లోతట్టు ప్రాంతాలనంతా ముంచేసింది. ఈ సీజన్​లోనే గరిష్ట వరద రాజమహేంద్రవరానికి తాకింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి గరిష్ట వరద 13.50 లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. కాటన్‌ ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దేవీపట్నం మండలం ఐదొవ రోజు ముంపులోనే మగ్గిపోతోంది. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చినా మిగతావారు వరదనీటిలోనే మగ్గిపోతున్నారు.

తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే!
ఆ గ్రామాలన్నీ నీటిలోనే....దేవీపట్నం మండల కేంద్రం దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి, వీరవరం, రమణయ్యపేట, అగ్రహారం, గొందూరు తదితర గ్రామాలన్నీ పూర్తిగా నీటిలోనే చిక్కుకుపోయాయి. గండిపోశమ్మ ఆలయం ఐదోవ రోజు వరదనీటిలోనే మునిగి ఉంది. ప్రజలు అంధకారంలోనే మగ్గిపోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆహారం, తాగునీరు అందడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోనసీమపై తీవ్ర ప్రభావం.. ధవళశ్వరం వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరికను చేరడంతో కోనసీమపై తీవ్ర ప్రభావం చూపింది. ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం, మామిడికుదురు, పి.గన్నవరం మండలాల్లోని లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లెపాలెంలో వరదనీరు చేరడంతో పరిస్థితిని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పరిశీలించారు. తీరం వెంబడి ఉద్యానవనం, పూలతోటలు పూర్తిగా నీట మునిగాయి. అరటి, బొప్పాయి తోటల్లోకి గోదావరి వరదనీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వరదలు అపారనష్టం తెచ్చిపెట్టాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు ధవళేశ్వరం వద్ద వరద కాస్త తగ్గే అవకాశం ఉన్నా... ఎగువ నుంచి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉండటంతో జలవనరులశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

Intro:Ap_cdp_47_04_errachandanam_pattiveta_Av_Ap10043
k.veeeachari, 9948047582
కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోళ్ల మడుగు ప్రాంతంలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు 15 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. ఈ మేరకు ఆదివారం రాజంపేట రేంజర్ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ డిఎఫ్ఓ కి అందిన సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున rollamadugu ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమయంలో అప్పటికే ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా తయారుచేసి రవాణాకు సిద్ధంగా ఉంచారని వివరించారు. ఇదే సమయంలో తాము మూకుమ్మడిగా దాడిచేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారని, మరో ముగ్గురు పరారయ్యారని తెలిపారు. రాయచోటి కి చెందిన వ్యక్తి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడి కూలీలతో ఎర్రచందనాన్ని కొట్టేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు రాయచోటికి చెందిన వారు కాగా మరో ఇరువురు అనంతపురానికి చెందిన వారు ఉన్నారని ఆయన వివరించారు.

Body:ఎర్రచందనం పట్టివేత ముగ్గురి అరెస్ట్

Conclusion:అటవీశాఖ రేంజర్ శ్రీనివాసులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.