తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. జలదిగ్బంధంలో దేవీపట్నం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వరద ఉద్ధృతితో 36 గ్రామాలకు ఐదురోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో స్థానికుల అవస్థలు పడుతున్నారు. పోచమ్మగండి, దండంగి, పూడిపల్లి, తొయ్యేరు గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. దేవీపట్నం, గానులగొందు, మంటూరు గ్రామాలలోనూ ఇదే పరిస్థితి. కచ్చులూరు నుంచి కొండమొదలు వరకు 20గ్రామాల గిరిజనలకు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల కొండలపైనా వరదబాధితులు తలదాచుకుంటున్నారు. గండిపోచమ్మ ఆలయ మండపాన్ని వరదనీరు తాకింది.
ఇదీ చూడండి