ETV Bharat / state

విగ్రహాల చోరీ కేసు.. ఇద్దరు అరెస్ట్​.. పరారీలో మరో ఇద్దరు

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గోలింగేశ్వరుడి గుడిలో విగ్రహాన్ని చోరీ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పురాతన విగ్రహాలకు వజ్రాలు ఉంటాయనే నమ్మకంతో దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

author img

By

Published : Aug 14, 2021, 8:11 PM IST

విగ్రహాల చోరీ నిందితుల అరెస్ట్
విగ్రహాల చోరీ నిందితుల అరెస్ట్

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గోలింగేశ్వరుడి గుడిలో నంది విగ్రహం చోరీ కేసు పోలీసులు ఛేదించారు. విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

పురాతన విగ్రహల్లో వజ్రాలు ఉంటాయనే నమ్మకంతో వారు చోరీకి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. వీరు చోరీకి ముందు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆలయాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

Heart Attack: విధి నిర్వహణలో ఉన్న హెడ్​కానిస్టేబుల్.. గుండెపోటుతో మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.