కౌలు రైతుల కష్టనష్టాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనే ఆలోచనతోనే వ్యవసాయం చేస్తున్నానని సీబీఐ పూర్వపు జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఈరోజు ఏరువాక సాగించనినట్లు వెల్లండించారు. రైతులతో కలిసి ఏరువాక సాగిన అనంతరం స్థానిక రైతులను లక్ష్మీనారాయణ సత్కరించారు.
రైతు నిత్య శ్రామికుడని.. కరోనా లాంటి కష్ట సమయంలోనూ విరామం లేకుండా పని చేసే వ్యక్తే రైతు అని కొనియాడారు. రైతన్న పండించిన పంటలతో మనం ప్రశాంతంగా జీవిస్తుంటే.. రైతు మాత్రం అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భాగస్వామ్యంతో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ పరిస్థితులు అధ్యయనం చేయాలేనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
Chandrababu: 'మామిడి రైతులకు ధరల స్థిరీకరణ సంస్థ ఏర్పాటు చేయాలి'