తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి 10.87 లక్షలు క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. గౌతమి గోదావరి, గౌతమి నదీ పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. కేంద్ర పాలిత యానం పరిధిలోనూ వరద పోటెత్తుతోంది.
బాలయోగి వారధి వద్ద మురుమళ్ళలోని వివేకానంద వారధి వద్ద సుడులు తిరుగుతూ సముద్రం వైపు పారుతోంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 12.4 అడుగుల నీటిమట్టం ఉంది.
ఇదీ చూడండి: