ETV Bharat / state

ఎమ్మెల్యే కుటుంబీకులకు 'మొదటి డోసు' టీకాలు.. ఎంపీడీవో సస్పెండ్! - ఎమ్మెల్యే చిట్టిబాబు వ్యక్సిన్ ఎంపీడీవో సస్పెండ్

నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుటుంబసభ్యులకు.. కొవిడ్ మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు ఎంపీడీవో వెంకటేశ్వరరావును కలెక్టర్ మురళీధర్ రెడ్డి సస్పెండ్ చేశారు. వ్యాక్సిన్ వ్యవహారంపై పి. గన్నవరం తహసీల్దార్ మృత్యుంజయరావు విచారణ జరిపి.. నివేదికను సబ్ కలెక్టరకు పంపారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు.

mpdo suspended
mpdo suspended
author img

By

Published : May 9, 2021, 9:23 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీడీవో వెంకటేశ్వరావు మాత్రం నిబంధనలను ఉల్లంఘించారు. ఎమ్మెల్యే కుటుంబంలో 11 మందికి మొదటి డోసు వేశారు.

విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. పి.గన్నవరం తహసీల్దార్ మృత్యుంజయరావు ఈ ఘటనపై విచారణ జరిపి అమలాపురం సబ్ కలెక్టరుకు నివేదిక పంపారు. ఆ నివేదిక ఆధారంగా జిల్లా పాలనాధికారి చర్యలకు ఉపక్రమించారు. ఎమ్మెల్యే చెప్పినందునే టీకాలు వేశారని తహసీల్దార్ నివేదికలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఆక్సిజన్ అందక కరోనా రోగి మృతి.. బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.