తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు సమీపంలో కాశీ (34) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఓడలరేవుకు చెందిన కాశీ (34).. మద్యం కొనేందుకు వెళ్లాడు. షాపు వద్ద మరో వ్యక్తితో తగాదా జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో కాశీ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతన్ని స్థానికులు ఇంటికి తీసుకెళ్లారు.
కొన్ని గంటల తరువాత కాశీ ఇంటి వద్ద మరణించాడు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై కె.ఎస్.వి సత్యప్రసాద్ తెలిపారు. మద్యం దుకాణం వద్ద తగిలిన గాయాలే మరణానికి కారణమై ఉంటుందని భావిస్తున్నామన్నారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి: